తాజాగా బిగ్ బాస్ హౌస్ లో గరం గరం గా సాగింది. నాగార్జున కుటుంబ సభ్యులకు చురకలంటించారు. ఇంటి సభ్యుల పై ప్రశంసలతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ అందుకోలేక త్యాగం చేసిన షణ్ముఖ్, సిరి, లోబో, రవి, శ్రీ రామ్, మానస్ లకు క్లాప్స్ తో అభినందనలు తెలిపారు. అనంతరం హౌస్ సభ్యులకు వార్నింగ్ లు ఇవ్వడం మొదలు పెట్టారు నాగార్జున.
ఇంటి సభ్యులు ఫోటోలు కట్ చేస్తూ వారి చేసిన విషయాలను తెలియజేశారు. మొదటగా లోబో ఫోటో కట్ చేస్తూ, గేమ్ బాగా ఆడుతున్నావని, ముత్యాల గేమ్ ఫై ప్రశంసలు కురిపించారు. ఇంకా ఎఫర్ట్ పెట్టాలి అని సూచించారు. ఆ తర్వాత రవి ఫోటో కట్ చేస్తూ ఎందుకు బాధ అనే విషయాన్ని అడిగాడు నాగార్జున. అందుకు ఒక వీడియో ఇప్పుడు చూపించారు.
ఇక ఆ వీడియోలో రవి ఇందులో నేను ఉండడం కరెక్టేనా, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నాడో తెలియడం లేదంటూ మాట్లాడాడు. ఇక్కడ ఈ విషయంపై రవి స్పందిస్తూ తన భార్య కూతురు ఎలా ఉన్నారో తెలియడం లేదు ఆ విషయాలు చెబితే బాగుంటుంది అని తను ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యాను అని తెలిపారు. ఇక ఇదే విషయాన్ని నాగార్జున చాలా సీరియస్ గా తీసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు స్ట్రాంగ్ గా ఉండాలని, అందుకు ఒప్పుకునే వచ్చావని ఫ్యామిలీ వాళ్ళని ఎప్పుడు చూపించాలో బిగ్ బాస్ కి తెలుసని నాగ్ తెలిపారు.
నిజంగానే ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే ఉండలేకపోతున్న వారు ఉంటే వెంటనే వెళ్ళిపోవచ్చు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. గేటు ఓపెన్ చేస్తా అనే వెళ్ళిపో అని స్పష్టం చేశారు నాగార్జున. హౌస్ లోకి వచ్చారు అంటే అన్ని బరించి స్ట్రాంగ్ గా ఉండాలని, ఫ్యామిలీతో అటాచ్మెంట్ అందరికీ ఉంటుందని నువ్వు అలా అనడం వల్ల ఇతరులను మిస్ గైడ్ చేసినట్టుందని వారికి లేని ఆలోచనలు కలిగించినట్టు ఉందని హెచ్చరించారు. అలాగే ఇంకెప్పుడు ఇలా చేయద్దని స్ట్రాంగ్ గా ఉండాలని తెలిపారు నాగార్జున.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…