Nagashaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం పలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కృష్ణ వింద్ర విహారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇలా ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఒక యాక్షన్స్ సన్ని వేషంలో నటించడం కోసం నాగశౌర్య మూడు రోజులపాటు ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినకుండా ఈ యాక్షన్ సన్ని వేశాలలో పాల్గొన్నారట.ఇలా ఏమి తినకపోవడంతో ఈయన పూర్తిగా డిహైడ్రేషన్ కి గురై షూటింగ్ లోకేషన్ లోనే ఈయన కళ్ళు తిరిగి పడిపోయారు.
ఈ క్రమంలోని చిత్ర బృందం నాగ సౌర్యను గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రికి తరలించారు.అయితే డిహైడ్రేషన్ కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయినటువంటి నాగశౌర్య ఇప్పటికీ ఇంకా డిశ్చార్జ్ కాలేదని సమాచారం అయితే ఈ నెల 20వ తేదీ ఈయన వివాహం కర్ణాటకకు చెందిన అనూష శెట్టి అనే యువతీతో జరగనుంది.
ఈ విధంగా పెళ్లికి మరో నాలుగు రోజులు సమయం ఉందనగా పెళ్ళికొడుకుగా ఇంట్లో ఉండాల్సిన నాగశౌర్య ఇలా పేషెంట్ లా ఆసుపత్రికి పరిమితమయ్యారు.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు నాగశౌర్య తిరిగి కోలుకోవాలని కోరుకుంటున్నారు అలాగే పెళ్లి సమయానికైనా ఈయన ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…