Nagashourya: ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు నాగశౌర్య. తన మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూసే విధంగా సినిమా కథలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో నాగశౌర్య సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి.
ఇదిలా ఉండగా నాగశౌర్య సినీ జీవితంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తగా ఇంటీరియర్ డిజైనర్ గా అనూష శెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో 2022 నవంబర్ 20వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇక వీరి వివాహం నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య తన అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని సమాచారం. ఈయన త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అనూష శెట్టి ప్రెగ్నెంట్ అని అయితే ఈ విషయాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియజేశారని తెలుస్తుంది.
ఇలా సన్నిహితులకు కూడా ఈ గుడ్ న్యూస్ చెప్పలేదని సమాచారం .అయితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగశౌర్య అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి నాగశౌర్య త్వరలోనే తండ్రి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…