YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమం ద్వారా సమాధానాలు చెప్పడమే కాకుండా అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఎంతో మంచి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు మరో 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు.
ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి బాటలో నడవాలి అంటే అనుభవం ఉన్న నాయకులు ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ తెలిపారు ఇలా ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతుంది. ఇలా అనుభవం కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం అదృష్టం. మరో పదేళ్లు బాబుగారే సీఎం అంటూ పవన్ తెలిపారు.
ఇక ఈ విషయం గురించి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం వైయస్ జగన్ కి ఒక రిపోర్టర్ నుంచి ప్రశ్న ఎదురయింది. పవన్ కళ్యాణ్ బాబు గారే మరో 10 సంవత్సరాల పాటు సీఎం అంటూ కామెంట్లు చేస్తున్నారు దానిపై స్పందన ఏంటి అనే ప్రశ్న ఎదురవుగా జగన్ సమాధానం చెబుతూ…
ఒక రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. సీఎం ఎవరు అనేది వారు చేసిన మంచి పనుల బట్టే ఉంటుందని మంచి పనులు చేసిన వారిని ప్రజలు ఆశీర్వదిస్తారని జగన్ చెప్పారు. దీంతో కొంతమంది మీరు మంచి చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని కాదని చంద్రబాబుకు అధికారం ఇచ్చారా.. అంటూ కామెంట్లు చేయగా మరికొందరు జగన్ కి మద్దతు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…