A.R Rahaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. 29 సంవత్సరాల పాటు సైరా బాను అనే మహిళతో వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ దంపతులు ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయారు. వీరి విడాకుల ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇలా రెహమాన్ తన భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై కూడా చర్చలు మొదలయ్యాయి. వీరి విడాకులకు ఇదే కారణం అంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న తరుణంలోనే సైరా బాను లాయర్ వీరి విడాకులకు గల కారణాలను బయట పెట్టడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా లాయర్ వందన షా మీడియాతో మాట్లాడుతూ.. రెహమాన్ దంపతులు విడిపోవడానికి.. అతని అసిస్టెంట్ మోహిని విడాకులు తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రెహమాన్ సైరా బాను ఇద్దరు కూడా వారి పరస్పర అంగీకారంతోనే కేవలం వ్యక్తిగత కారణాలవల్లే విడాకులు తీసుకొని విడిపోయారే తప్ప ఎలాంటి ఎఫైర్లు కాదని, తన విడాకుల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవమని తెలిపారు.
ఈ విధంగా రెహమాన్ సైరా భాను విడాకులు తీసుకొని విడిపోవడం ఎంతో బాధ కలిగించే విషయం ఈ విషయాన్ని ఎవరు ఇష్టపడరని అలాగే ఎవరు సెలబ్రేట్ కూడా చేసుకోరని లాయర్ వందన షా తెలియజేశారు. ఇక వీరి విడాకులకు వారి వ్యక్తిగత విషయాలే కారణం. వారి వ్యక్తిగత స్వేచ్ఛ మేరకే ఆ విషయాలను బయట పెట్టలేదని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…