Namratha Shirodkar : నమ్రత శిరోద్కర్ ఫెమినా మిస్ ఇండియా గా మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి బాలీవుడ్ సినిమాలతో బిజీ అయినా ఆ తరువాత తెలుగులో మహేష్ బాబు తో కలిసి వంశీ, చిరంజీవితో కలిసి అంజి సినిమాలో నటించింది. ఇక మహేష్ బాబు తో చేసిన వంశీ సినిమా టైములోనే ప్రేమలో పడ్డారు. 2005 లో మహేష్ బాబుతో వివాహం జరిగాక నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పారు. తన కుటుంబ బాధ్యతలతో బిజీ అయ్యారు. పిల్లలు పుట్టాక తల్లిగా భార్యగా మరింత భాద్యతలు పెరిగాయి. ఇక అటు మహేష్ సినిమాలకు సంబంధించిన పనులతో పాటు, జీఏంబి ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు భాద్యతలను చూసుకుంటున్నారు.
సినిమాల్లోకి రీ ఎంట్రీ…..
సినిమాల్లో కనిపించక పోయినా నమ్రత కొన్ని కమర్షియల్ యాడ్స్ లో మహేష్ తో కలిసి చేసారు. ఇక తరచూ ఫ్యామిలీ తో కలిసి ఫోటోషూట్స్ లో పాల్గొంటుంటారు. ఇటీవల తన సన్నిహితుల స్టైలింగ్ షాప్ ఓపెనింగ్ కి అతిధిగా వచ్చిన నమ్రత తన సినిమా రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య ఫోటో షూట్లు, సోషల్ మీడియాలో ఫొటోలతో యాక్టివ్ గా ఉండటంతో చాలా మంది మళ్ళీ సినిమాలోకి నమ్రత రీ ఎంట్రీ ఇస్తారు అని భావిస్తున్న నేపథ్యంలో నమ్రత స్పందించడం ఆసక్తిని రేపింది.
సినిమాల్లోకి రావలన్న ఆసక్తి లేదని ప్రస్తుతం తన కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉన్నానని, తన కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడుతానని. ఇపుడే కాదు భవిష్యత్తులో కూడా సినిమాల్లో మళ్ళీ నటించే ఉదేశ్యం లేదని, ఈ విషయం కొంతమంది అభిమానులను హర్ట్ చేయొచ్చు కానీ సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పేసింది. దీంతో ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారని ఆశపడిన అభిమానులు నిరాశ పడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…