Categories: FeaturedMovie News

Chaitanya Krishna: శాపం వల్లే నందమూరి ఫ్యామిలీలో వరస మరణాలు జరుగుతున్నాయా… ఎమోషనల్ అయిన చైతన్య కృష్ణ?

Chaitanya Krishna: నందమూరి కుటుంబంలో ఈ మధ్యకాలంలో వరస మరణాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆ తర్వాత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదం నుంచి బ్రతికి బయటపడ్డారు. ఇక తారకరత్న కూడా ఇటీవల మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మరణాలన్నింటి గురించి తాజాగా నందమూరి చైతన్యకృష్ణ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చైతన్య కృష్ణ గత రెండు దశాబ్దాల క్రితమే హీరోగా నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఈయన మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తాజాగా ఈయన బ్రీత్ అనే సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి చైతన్య కృష్ణ తన ఫ్యామిలీ గురించి రాజకీయాల గురించి సినిమాల గురించి కూడా మాట్లాడారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు నందమూరి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వరస మరణాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏదైనా శాపం వల్ల వరుస మరణాలు జరుగుతున్నాయా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు చైతన్య కృష్ణ సమాధానం చెబుతూ శాపం వల్లే అని కాదు కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా కొన్ని ట్రాజడీలు జరుగుతూ ఉంటాయి అలాగే మా ఫ్యామిలీలో కూడా జరిగి ఉంటాయి ఏమోనని ఈయన తెలిపారు.

వారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం…

ఇలా మా కుటుంబంలో వరుస మరణాలు జరగడం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని తెలియజేశారు.హరికృష్ణ బాబాయ్ తో పాటు జానకిరామ్ తారకరత్న మరణ వార్త మమ్మల్ని బాగా కలిసి వేసిందని తెలిపారు. ఇక జానకిరామ్ నందమూరి తారక రామారావు మనవడు అంటే ఎవరు నమ్మరని అంత సింపుల్గా ఎలాంటి గర్వం లేకుండా ఉంటారని చైతన్య కృష్ణ తెలిపారు. ఇక తారకరత్న కూడా ఏమాత్రం గర్వం లేకుండా తన ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఎదిగే రకం కాదని తారకరత్న నాతో చాలా మంచి సన్నిహితంగా ఉండేవారని చైతన్య కృష్ణ ఈ సందర్భంగా వారి మరణాలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago