Movie News

Hyper Aadi: జీతం వస్తే డబ్బులు అన్ని వడ్డీలకే సరిపోయేవి.. ఫ్యామిలీ కష్టాలు బయటపెట్టిన ఆది!

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కామెడీ పంచ్ డైలాగులతో అందరిని ఆకట్టుకున్నటువంటి ఈయన తమ స్కిట్లకు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పనిచేసేవారు. అలాగే తక్కువ సమయంలోనే టీం లీడర్ గా కూడా మారిపోయారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి ఈయన అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఈ కార్యక్రమానికి దూరమైనటువంటి ఆది వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హైపర్ ఆది తన ఫ్యామిలీ గురించి అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తమ తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు సంతానమని అయితే మమ్మల్ని చదివించడం కోసం మా నాన్న ఎన్నో అప్పులు చేశారని తెలిపారు. తాను మొదట్లో జాబ్ చేస్తూ వచ్చే సాలరీ మొత్తం ఈ అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోయేది ఇలా వడ్డీలు చెల్లిస్తూ ఉంటే ఇలాగే ఉంటామని చెప్పి ఉన్న మూడు ఎకరాల పొలం కాస్త అమ్మేసామని అది తెలియజేశారు. ఇక తన తండ్రి కూడా చిన్నప్పటినుంచి నాటకాలు వేసే వారని ఆయన లాగే నాకు కూడా నాటకాలపై ఆసక్తి కలిగి ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు.

హీరోగా రావాలని ఆలోచన లేదు…

ప్రస్తుతం స్క్రిప్ట్ రైటర్ గా ఉన్నటువంటి మీరు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ తయారు చేసి హీరోగా ఎప్పుడు రాబోతున్నారు అంటూ కూడా ఈయనకు ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ స్క్రిప్ట్ రెడీ చేయాలి అంటే అంత సులువైన విషయం కాదని ప్రస్తుతం నేను కమిట్ అయినటువంటి వాటన్నింటినీ పక్కన పెడితేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఇక హీరోగా తాను ఎప్పుడూ కూడా నటించాలని అనుకోవడం లేదని ఆది తెలిపారు. ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి ప్రాజెక్టులతో చాలా సంతోషంగా ఉన్నానని ఈయన వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

5 minutes ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

17 minutes ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

22 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

22 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago