Categories: FeaturedMovie News

Nandhamuri Mohan Krishna : నందమూరి మోహన కృష్ణ గురించి బయటి ప్రపంచానికి తెలియని నిజాలు…!

Nandhamuri Mohan Krishna : గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ మనవడు మోహనకృష్ణ తనయుడు తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుగు ప్రజలు ఎక్కువగా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. లోకేష్ చేపట్టిన యువ గళం సభలో పాల్గొని పాదయాత్రలో వెళ్తుండగా ఒక్కసారిగా తారక రత్న కుప్పకూలి పడిపోయాడు. గుండెపోటు వచ్చిందని నిర్ధారణ అయ్యాక వెంటనే బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. గుండె పనిచేయడం ఆగిపోవడం, తారక రత్నకు మల్టిపుల్ బ్లాక్స్ శరీరంలో ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక అన్ని విషయాలను బాలకృష్ణ పక్కనే ఉండి చూసుకుంటూ ఉండటంతో అసలు తారక రత్న తండ్రి కనిపించడం లేదు ఆయన ఎందుకు కొడుకు వద్దకు రాలేదు అనే సందేహాలు మొదలయ్యాయి.

మోహన్ కృష్ణ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడే…

తారక రత్నకు తండ్రి మోహన్ కృష్ణకు మధ్య తారక రత్న ప్రేమ పెళ్లి వల్ల గ్యాప్ వచ్చింది. అయితే తారక రత్నకు పాప పుట్టాక ఆ దూరం తరిగిపోయింది. నిజానికి మోహన్ కృష్ణ కూడా ఇండస్ట్రీకి చెందిన వారే. ఆయన గురించి చాలా మందికి ఎన్టీఆర్ తనయుడుగానే తెలుసు కానీ ఆయన సినిమాలకు పనిచేసారనే విషయం తక్కువ మందికే తెలుసు. అయితే సినిమాల్లో నటించాలనే కోరిక మోహన కృష్ణకు లేదు. కానీ సినిమా పరిశ్రమలోనే ఉండాలని అనుకున్నారట. తండ్రి ఎన్టీఆర్ మోహన కృష్ణను మొదట హీరో చెయ్యాలని అనుకున్నా మోహన కృష్ణ గారికి ఇంట్రస్ట్ లేకపోవడంతో వద్దనుకుని ఆయన ఛాయాగ్రహకుడు అవ్వాలని అనుకునుటున్నట్లు చెప్పగానే ఒప్పుకున్నారట.

అలా అమెరికా వెళ్లి సినిమాటోగ్రఫీలో శిక్షణ తీసుకున్న మోహన కృష్ణ గారు ముందు అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి ఆ తరువాత డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసారు. తండ్రి సినిమాలకు అలాగే తమ్ముడు బాలకృష్ణ సినిమాలకు పనిచేసారు. ‘గొప్పింటి అల్లుడు’ సినిమా తరువాత మోహన కృష్ణ గారు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం దాదాపుగా ఆపేసారు. ప్రస్తుతం ఇతర వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అయన భార్య నిర్మాత విశ్వేశ్వరయ్య గారి కూతురు. ఇక ఆయనకు తారక రత్న కాకుండా కూతురు మోహన రూప ఉన్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago