Featured

Nandhu : రన్వీర్ సింగ్ ను ఫాలో అవుతున్న గీతా మాధురి భర్త… న్యూడ్ ఫోటోలకు సపోర్ట్…!

Nandhu : ఎప్పుడు ఏ విషయం జనాలకు నచ్చుతుందో ట్రెండ్ అవుతుందో తెలియదు. తాజాగా బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ చేసిన ఒక పని అందరినీ ఆశ్చర్య పరిచింది. కొంతమంది ఏమిటి ఇలాంటి పని చేసాడు అంటూ ట్రోల్ చేస్తుంటే మరోవైపు కొంత మంది మాత్రం రన్వీర్ కు సపోర్ట్ గా నిలిచారు. ఇక కొంత మంది సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో రన్వీర్ కు మద్దతుగా నిలిచారు, వీ సపోర్ట్ అంటూ వాళ్ళు కూడా అర్దనగ్నంగా ఫోటోలు తీసి నెట్టింట్లో పెడుతున్నారు. తాజాగా రన్వీర్ కు పోలీస్ కేసులు కూడా ఈ విషయంలో ఎదురయ్యాయి. ముంబై లో ఆయన మీద కేసు నమోదైంది. మహిళల మనోభావాలకు భంగం కలిగేది గా ఆ ఫోటోషూట్ ఉందంటూ చెంబురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు.

సింగర్ భర్త రన్వీర్ ను ఫాలో అయ్యాడు…

తాజాగా రన్వీర్ కు మద్దతుగా సెలబ్రిటీలు కూడా అర్ద నగ్నంగా ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో విష్ణు విశాల్ అర్ధ నగ్నంగా ఫోటోలు షేర్ చేసాడు. అందులోను ఆ ఫోటోలను తన భార్య తీసిందని చెప్పడం విశేషం. ఇక ఇపుడు టాలీవుడ్ కి ఈ ట్రెండ్ సోకినట్లుంది. సింగర్ గీతా మాధురి భర్త నందు కూడా అర్ధ నగ్నంగా ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టాడు. కేవలం టవల్ మాత్రమే అడ్డు ఉండే ఫోటోలను షేర్ చేసాడు. పైగా రన్వీర్ సింగ్ కి సపోర్ట్ అంటూ పోస్ట్ చేసాడు. ఇక దీనిపై చాలా మంది నెటిజన్స్ స్పందించారు.

కొంతమంది తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించదుసనికి ఈ ట్రెండ్ బాగా కలిసివచ్చిందని సూపర్ బ్రో అంటూ కామెంట్స్ పెడుతుంటే మరి కొంత మంది ఏంటి మాకీ కర్మ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రన్వీర్ సింగ్ ఒక మ్యాగ్ జైన్ కోసం చేసిన ఈ ఫోటో షూట్ కి కారణం 70వ దశకంలో పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్ కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ చేసి అప్పట్లో సంచలనం రేపాడు. బర్ట్ రేనాడ్స్‌కు నివాళి అర్పించేందుకు రణ్‌వీర్ సింగ్ ఈ ఫోటోషూట్ చేశాడు. గోడకు బల్లిలా అతుక్కొని, నేలను కరుచుకొని రణ్‌వీర్ ఫోటోలకు ఫోజిలిచ్చాడు. ఇక ఈ ఫోటోలు వివాదాలతో పాటు, కొత్త ట్రెండ్ ని కూడా సృష్టించాయి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago