నన్నుపెళ్లి చేసుకుంటావా అని నాని ని అడిగిన వేశ్య… రిప్లై తో షాక్ ఇచ్చాడుగా ?
Nani:నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం ” శ్యామ్ సింగరాయ్ “. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాగా కలకత్తా బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. డిసెంబర్ 17 న రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగుతో పాటు… తమిళ్, కన్నడ భాషలలో మంచి కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రంలో నాని అప్ కమింగ్ యంగ్ డైరెక్టర్ గా, శ్యామ్ సంగ రాయ్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించాడు. శ్యామ్ సింగ రాయ్ పాత్రలో పవర్ ఫుల్ గా ఉంటూనే ఎమోషనల్ గా కూడా మెప్పించాడు.
థియేటర్లలోనే కాకుండా ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకులను మెప్పిస్తోందీ చిత్రం. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా ఈ చిత్రం ప్రసారం అవుతుంది. కాగా ఈ సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ హనుమ విహారి వంటి ప్రముఖులు చిత్ర బృందంపై ప్రశంసలు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో డిలీట్ చేసిన ఒక సీన్ ను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది చిత్రబృందం.
శ్యామ్ సింగ రాయ్ గా నాని… వేశ్యలందరితో కూర్చుని ఉంటాడు. వారి కోసం నాని ఓ కవిత రాసి వినిపిస్తాడు. అప్పుడు ఒక వేశ్య… ‘ఇంత తెలిసిన నువ్వు మరి నన్ను పెళ్లి చేసుకుంటావా ? అని అడుగుతుంది. దీనికి శ్యామ్ ” కచ్చితంగా చేసుకుంటాను… నిన్ను ప్రేమించిన రోజు ” అని సమాధానమిస్తాడు. ఈ సీన్ కూడా సినిమాలో ఉంటే ఇంకా బాగుండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి దీనిని సినిమా నుంచి ఈ సీన్ ని తొలగించడానికి గల కారణాలు చిత్ర బృందానికే తెలియాలి
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…