Actress Sudha:ఆ టైమ్ లో వాళ్ళంతా నన్ను దూరం పెట్టారంటూ కన్నీరు పెట్టుకున్న నటి సుధ… కారణం అదేనా ?
Actress Sudha:టాలీవుడ్ లో వెయ్యికి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుధ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె నటన చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే… బాలనటిగా అలరించిన ఆమె పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్‌గానూ మారింది. తల్లీ, అత్త, అక్క ఇలా అన్ని పాత్రల్లో అలవోకగా నటించి ప్రేక్షకులను అలరించింది సుధా. అలాగే ఈమె వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి… ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆమె సినీ కెరీర్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతుంది. అయితే ఈమె అప్పుడప్పుడు పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మనసు లోని మాటలని బయటపెట్టింది.
తాజాగా ఆమె తన జీవితంలోని ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్లు వివరించింది. ‘ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా సంపాదించుకున్నాను, కానీ బిజినెస్‌లు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఢిల్లీలో ఒక హోటల్ పెట్టినప్పుడు లాభం వస్తే దాంతో మరో హోటల్ పెట్టాను. అప్పుడు నష్టాలొచ్చి నిండా మునిగాను. కొన్నాళ్ల పాటు నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. కానీ కుటుంబ సమస్యలు, అమ్మాయి పెళ్లి ఉండటంతో చెన్నైకి మారాల్సి వచ్చింది అని చెప్పారు. చిన్నప్పుడే అమ్మ హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది. ఆమె పోయిన తర్వాత కొడుకులున్నా నాన్నకు సపోర్ట్ లేకుండా పోవడంతో ఆయనని నేనే చూసుకున్నాను.
నాన్నకు బాగానే ఆస్తుపాస్తులు ఉండేవి. కానీ క్యాన్సర్ వల్ల అవి అన్నీ ఖర్చు అయిపోయాయి. అమ్మ పోయినప్పుడు కూడా అంత బాధపడలేదు, కానీ నాన్న పోయాక లైఫ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. నాన్నకు క్యాన్సర్ అనగానే బంధువులంతా దూరం పెట్టారు… వీటినుంచి నేను చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. అప్పుడే మనుషుల్ని నమ్మకూడదని అర్థమైంది. నా భర్త, కొడుకులు కూడా నాకు దూరంగా ఎక్కడో యూఎస్‌లో ఉన్నారు. కానీ వాళ్లకూ నాలాంటి పరిస్థితే వస్తుంది. మాతృదేవోభవ సినిమాలోని చాలా సంఘటనలు నా నిజ జీవితంలో జరిగినవే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుధ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…