Featured

Mahesh Babu:రమేశ్ బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో బోరున ఏడ్చేసిన మహేష్ బాబు… అన్నయ్య ఇక లేడంటూ !

Mahesh Babu:సూపర్ స్టార్​ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేశ్​​ బాబు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. 56 ఏళ్ల రమేశ్​ బాబు అనారోగ్యంతో జనవరి 8న రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. చిన్నప్పటి నుంచి సోద‌రుడితో అత్యంత స‌న్నిహితంగా ఉండేవారు మ‌హేష్. ఆ విషయ్లను పలు సంధార్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. మహేష్ కు కోవిడ్ వచ్చిన కార‌ణంగా క్వారంటైన్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి వచ్చింది. దీంతో సోద‌రుడిని చివ‌రి చూపు కూడా చూసుకోలేక‌పోయారు. ఈ విషయం ఘట్టమనేని అభిమానులను కూడా ఎంతో బాధపెట్టింది.

Mahesh Babu:రమేశ్ బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో బోరున ఏడ్చేసిన మహేష్ బాబు… అన్నయ్య ఇక లేడంటూ !

అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న మహేశ్​ బాబు శనివారం (జనవరి 22) సోదరుడు రమేశ్​ బాబు పెద్దకర్మకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తన అన్నయ్య మరణించిన రోజు రాలేకపోయినందుకు ఎంతో బాధపడినట్లు తెలుస్తోంది. అన్నయ్యతో మహేశ్ బాబు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. రమేశ్​ బాబు చనిపోయినప్పుడు మహేష్ భావోద్వేగంగా ట్వీట్​ చేసిన విషయం తెలిసిందే. ఇక రమేశ్ బాబు పెద్దకర్మకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహిత బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.

Mahesh Babu:రమేశ్ బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో బోరున ఏడ్చేసిన మహేష్ బాబు… అన్నయ్య ఇక లేడంటూ !

రమేశ్ బాబు – మహేష్ బాబు సినీ ప్రయాణం

ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు క‌లిసి పలు సినిమాలు చేశారు. బ‌జార్ రౌడీ, ముగ్గురు కొడుకులు సినిమాల్లో ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు క‌లిసి యాక్ట్ చేశారు. తండ్రి బాట‌లోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు రమేష్ బాబు. తెలుగు సినిమా చరిత్ర‌లో ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో యువ అల్లూరి పాత్ర‌లో క‌నిపించారు. నటుడిగా అదే ఆయ‌న తొలి సినిమా. మహేష్ బాబు నటించిన దూకుడు, ఆగ‌డు చిత్రాల‌కు ర‌మేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా వ్యవహరించారు. రమేశ్ బాబు మృతి ఘట్టమనేని ఫ్యామిలీకి తీరని లోటు అనే చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago