Categories: FeaturedMovie News

Naga chaithanya:అలా ఇష్టం వచ్చినట్లు రాయడం వల్ల చాలా బాధపడ్డాను అంటున్న నాగ చైతన్య… ఇంకా ఏమన్నారంటే ?

naga chaithanya:తెలుగు ఇండస్ట్రీలో లవ్లీ కపుల్‌గా చెప్పుకునే నాగచైతన్య – సమంత తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. వీరి విడాకుల వ్యవహారం​ ఇప్పటికీ హాట్‌ టాపిక్‌ గానే ఉంది. విడాకుల ప్రకటన కి ముందు, తర్వాత కూడా వీరి విడాకుల అంశం గురించే సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వారు విడిపోవడానికి గల కారణాలను సమంత కానీ , నాగ చైతన్య కానీ తెలుపకపోవడంతో… వారు విడిపోవడానికి కారణలు ఇవే అంటూ ఎవరికి తోచింది వారు అనుకుంటున్నారు. ఈ తరుణంలోనే రీసెంట్‌గా విడాకులపై స్పందించిన నాగ చైతన్య… ఇద్దరి మంచి కోసం ఈ డెసిషన్‌ తీసుకున్నామని, దీనివల్ల ఇద్దరం సంతోషం ఉన్నామని తెలిపాడు.

Naga chaithanya:అలా ఇష్టం వచ్చినట్లు రాయడం వల్ల చాలా బాధపడ్డాను అంటున్న నాగ చైతన్య… ఇంకా ఏమన్నారంటే ?

కాగా తాజాగా నాగ చైతన్య మరోసారి విడాకులపై స్పందించాడు. ఇటీవల ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ విడాకుల వ్యవహారం గురించి మరోసారి నోరు విప్పాడు. నా గురించి ఏం రాసినా పర్వాలేదు కానీ… నా కుటుంబం రాస్తే నేను బాధపడతాను అని అన్నారు. నాన్న చెప్పినట్లు కుటుంబంలో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలి. లేకపోతే పర్వాలేదు కానీ నా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు రాయడం నన్ను బాధించింది. అయినా పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. అందుకే విషయాన్ని మిస్‌ లీడ్‌ చేయనంత వరకు నేను స్పందించను అంటూ చైతూ చెప్పుకొచ్చాడు.

Naga chaithanya:అలా ఇష్టం వచ్చినట్లు రాయడం వల్ల చాలా బాధపడ్డాను అంటున్న నాగ చైతన్య… ఇంకా ఏమన్నారంటే ?

సక్సెస్ ఫామ్ ని చైతూ కొనసాగిస్తాడా ?

ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే… ఇటీవల లవ్ స్టోరి, బంగార్రాజు చిత్రాలతో సూపర్ హిట్ విజయాలు అందుకున్నాడు ఈ యంగ్ హీరో. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ” బంగార్రాజు ” మంచి కలెక్షన్ లతో దూసుకుపోతుంది. అలానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ సినిమాలో కూడా చైతూ నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చైతన్య ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago