Movie News

Mahesh Babu: నమ్రత అంటే మహేష్ బాబుకు అంత భయమా.. ఆ షోలో బయటపెట్టిన మహేష్ బాబు!

Mahesh Babu: టాలీవుడ్ క్యూట్ కపుల్ మహేష్ బాబు, నమ్రతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వంశీ సినిమా సమయంలో వయసులో తనకంటే పెద్ద అయిన నమ్రతను పెళ్లి చేసుకున్నాడు మహేష్ బాబు. అయితే వారి పెళ్లికి తండ్రి కృష్ణ ఒప్పుకోకపోవడంతో మహేష్ బాబు సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ భర్త మహేష్ బాబుకు సంబంధించిన అన్ని పనులను చూసుకుంటోంది. మహేష్ బాబు తో పాటు తన పిల్లలను, అలాగే ఇంటి బాధ్యతలను ఇలా అన్నింటినీ సక్రమంగా నిర్వహిస్తోంది నమ్రత.

మహేష్ కు నమ్రత వెన్నెముక లాంటిది అని కూడా అంటూ ఉంటారు.మరి అలాంటి నమ్రతకు మహేష్ బాబు భయపడతాడట అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మహేష్ బాబు ఒక షోలో చెప్పడం విశేషం. మహేష్ బాబు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకె షోలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే విడుదల చేశారు షో నిర్వాహకులు. అందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ఆహా లో ప్రసారం కానుంది. ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నమ్రత గురించి బాగానే చెప్పావు ఆమె కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది అని బాలయ్య చెప్పగానే.. ఏంటి అంటూ మహేష్ బాబు క్యూరియాసిటీ ప్రదర్శించారు. నమ్రత పేరు చెప్పగానే బాడీలో డిసిప్లేన్ వచ్చింది అని బాలయ్య అనగా.. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి సార్..ఎందుకు ఇవన్నీ గొడవలు అని మహేష్ బాబు సరదాగా అనడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. మహేష్ బాబు అన్న మాట పై నెటిజన్స్ మరిన్ని వార్తలు యాడ్ చేస్తూ నమ్రత మహేష్ భయపడతారా? అంటే అవును అంటూ వార్తలను సృష్టిస్తున్నారు.

5 కిలోమీటర్లు వెనక్కి పరిగెత్తాను..


ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి మహేష్ బాబు పార్కులో వాకింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా పాము కనిపించడంతో దాన్ని చూసిన మహేష్ బాబు భయపడి వెనక్కి 5 కిలోమీటర్లు పరిగెత్తి ఇంటికి వెళ్ళిపోయాడట. అప్పటి నుంచి మళ్లీ కెబిఆర్ పార్క్ కి వెళ్లలేదని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. మీ పిల్లల్లో ఎవరు క్యాట్, ఎవరు బ్రాట్ అని బాలయ్య ప్రశ్నించగా.. గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago