న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్. అంతే కాదు విభిన్న మైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చివరిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన వి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటించారు.
ఈ సినిమా పేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. వరుస సినిమాలతో దూసుకు వస్తున్నాడు నాని. ఇప్పటికే శివ నిర్వాణం దర్శకత్వం వహిస్తున్న టక్ జగదీష్ సినిమా ను పూర్తి చేసాడు. ఏ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా తర్వాత టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘అంటే .. సుందరానికీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఇదిలా ఉంటే త్వరలో మరో సినిమాతో రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చేసారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ లో వీళ్లీద్దరి కాంబోలో సినిమా రాబోతుందని అంటున్నారు. ఇక మారుతి ప్రస్తుతం గోపీచంద్ కథానాయకుడిగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను రూపొందిస్తున్నాడు. తనదైన యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా ఆయన రాశి ఖన్నాను తీసుకున్నాడు. గోపిచంద్ తో సినిమా కంప్లీట్ అయ్యాక నాని తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…