హీరోగా నారా లోకేష్ మిస్ అయిన సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో తెలుసా?

సాధారణంగా ఏ రంగంలో పని చేసేవారు వారి వారసులను కూడా అదే రంగంలోకి తీసుకువెళ్లాలని భావిస్తారు. ఈ క్రమంలోనే క్రీడా రంగంలో ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలను కూడా అదే రంగంలోకి తీసుకువెళ్తారు. రాజకీయాలలో ఉన్న వారు రాజకీయ రంగంలోకి, సినిమా రంగంలో ఉన్న వారు సినిమా రంగంలోకి వారి వారసులను తీసుకు వస్తారు. కానీ రాజకీయ రంగంలో ఉన్నవారు సినిమా రంగం వైపు రావడం చాలా తక్కువ.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ్ హీరోగా సినిమా రంగం వైపు వచ్చారు. అలాగే ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. అందుకు అన్ని ఏర్పాట్లను కూడా చేశారు.

అప్పట్లో నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన “జయం” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే తేజ దర్శకత్వంలో ఒక ప్రేమ కథ చిత్రం ద్వారా నారా లోకేష్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు.అయితే లోకేష్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే భవిష్యత్తులో రాజకీయ వారసత్వంపై దెబ్బ పడే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావించారేమో కానీ లోకేష్ మాత్రం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేకపోయారు.

ఈ క్రమంలోనే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన మొట్టమొదటి సినిమా “నిన్ను చూడాలని” సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు చెక్ పెట్టడం కోసమే నారా లోకేష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు గానీ నారా లోకేష్ మాత్రం ఇండస్ట్రీలోకి రాలేకపోయారు. అయితే నారా లోకేష్ హీరోగా ఒక సినిమాను మిస్ చేసుకున్నారంటూ అప్పట్లో సినీ సపరివార పత్రిక సంతోషం ప్రారంభ సంచిక లో మొదటి పేజీ పై ప్రచురించడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు స్పందించి సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప స్టార్ ని కోల్పోయిందంటూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.