Naresh Pavitra Lokesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నరేష్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయన నటి పవిత్ర లోకేష్ తో పెట్టుకున్నటువంటి రిలేషన్ వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి నరేష్ తిరిగి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు.
ఈమెను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నరేష్ గురించి పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వీరి వ్యవహారం కాస్త మీడియా వార్తల్లో నిలిచింది.ఇలా ఎన్నో గొడవలు జరిగినప్పటికీ నరేష్ పవిత్ర మాత్రం తమ బంధం గొప్పది అంటూ ఎప్పటికప్పుడు తమ బంధం గురించి తెలియజేస్తూ వచ్చారు..
2022 డిసెంబర్ 31వ తేదీన వీరిద్దరూ కేక్ కట్ చేస్తే లిప్ లాక్ పెట్టుకున్నటువంటి వీడియోని విడుదల చేస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.అయితే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇది నిజమైన పెళ్లి కాదని ఒక సినిమాలో భాగంగా ఇలా నటించారని తెలుస్తోంది.
ఇలా పెళ్లి చేసుకున్నట్లు నరేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా తాజాగా తమ హనీమూన్ కి సంబంధించిన ఫోటోలను కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఈ జంట తమ హనీమూన్ కోసం ఇతర దేశాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది.అయితే ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాదులో ఉన్నప్పటికీ ఈ ఫోటోలు ఎలా సాధ్యమయ్యాయి అనే విషయానికి వస్తే…
వీరిద్దరూ ఇదివరకే కలిసే ట్రిప్ కి వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రతి ఒక్కరు వీరిద్దరు హనీమూన్ వెళ్లారని భావిస్తున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు పాతవి కావడంతో ప్రతి ఒక్కరు ఈ జంట పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లారని భావిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే ఈ విషయంపై నరేష్ స్పందించాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…