కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నేషనల్ పెన్షన్ స్కీమ్ సబ్‌స్క్రైబర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్ల కొరకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్లకు ఆఫ్ లైన్ లో మాత్రమే ఈ స్కీమ్ నుంచి వైదొలగే అవకాశం ఉండేది. అయితే ఇకపై ఆన్ లైన్ లో ఈ స్కీమ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసింది.
సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజన్సీ సిస్టమ్ లోకి లాగిన్ కావడం ద్వారా ఎన్పీఎస్ సబ్ స్క్రైబర్లు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి వైదొలగే అవకాశం ఉంటుంది. సబ్‌స్క్రైబర్లు ఆన్‌లైన్‌లో వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి సులభంగా ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. విత్‌డ్రాయెల్ డాక్యుమెంట్, కేవైసీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
మార్కెట్ లో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ అందుబాటులో ఉండగా భాగస్వామికి కూడా ఆర్థిక భద్రత అందించే స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు.ఒక వ్యక్తి కేవలం ఒక ఎన్పీఎస్ అకౌంట్ ను మాత్రమే కలిగి ఉండాలి. ఒక వ్యక్తి భార్యకు కూడా ఆర్థిక భద్రత కల్పించాలని అనుకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరితే మంచిది.
అయితే 60 సంవత్సరాలు దాటిన తరువాత మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నెలకు 5,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రూ.1,11,98,471 వస్తాయి. మన దేశంలోని పౌరులు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…