దేశంలోని చాలామంది ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి రైళ్ల ద్వారా ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే చాలా సందర్భాల్లో ట్రైన్ అనుకున్న సమయానికి రాకపోవడం, ఇతర ఇబ్బందులను ప్రయాణికులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే రైళ్ల ద్వారా ప్రయాణాలు చేసేవాళ్లు కొన్ని ఫోన్ నంబర్ల ద్వారా రైలు ఎక్కడుందో, ఆలస్యంగా నడుస్తుందో లేక సరైన సమయానికి వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
రైలు ప్రయాణికులు సులభంగా పీఎన్ఆర్ స్టేటస్ ను కూడా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 91 – 9881193322 నంబర్ ను స్మార్ట్ ఫోన్ లో సేవ్ చేసుకొని వాట్సాప్ యాప్ ద్వారా పీఎన్ఆర్ నెంబర్ ను ఎంటర్ చేసి సులభంగా రైలు ప్రయాణానికి సంబంధించిన అప్ డేట్స్ ను తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ నెంబర్ ఆధారంగా రైలు ప్రయాణానికి సంబంధించిన ప్రతి అప్ డేట్ వాట్సాప్ యాప్ కు వస్తుంది.
ఈ నంబర్ ను సేవ్ చేసుకోవడం ద్వారా రైలు ప్రయాణానికి సంబంధించి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా, ఎవరినీ అడకుండా సులభంగా ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల రైల్వే శాఖ పరిమిత సంఖ్యలోనే రైళ్లను నడుపుతోంది. ఆ నంబర్ మాత్రమే కాకుండా మరో నంబర్ ద్వారా కూడా వాట్సాప్ ట్రైన్ అప్ డేట్స్ తెలుసుకోవచ్చు.
91 – 7349389104 నంబర్ ద్వారా కూడా రైలు ప్రయాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ లలో రైల్వే శాఖ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రైల్వే శాఖ తెచ్చిన కొత్త ఫీచర్ల ద్వారా రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…