కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నేషనల్ పెన్షన్ స్కీమ్ సబ్‌స్క్రైబర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్ల కొరకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్లకు ఆఫ్ లైన్ లో మాత్రమే ఈ స్కీమ్ నుంచి వైదొలగే అవకాశం ఉండేది. అయితే ఇకపై ఆన్ లైన్ లో ఈ స్కీమ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసింది.
సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజన్సీ సిస్టమ్ లోకి లాగిన్ కావడం ద్వారా ఎన్పీఎస్ సబ్ స్క్రైబర్లు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి వైదొలగే అవకాశం ఉంటుంది. సబ్‌స్క్రైబర్లు ఆన్‌లైన్‌లో వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి సులభంగా ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. విత్‌డ్రాయెల్ డాక్యుమెంట్, కేవైసీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

మార్కెట్ లో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ అందుబాటులో ఉండగా భాగస్వామికి కూడా ఆర్థిక భద్రత అందించే స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు.ఒక వ్యక్తి కేవలం ఒక ఎన్పీఎస్ అకౌంట్ ను మాత్రమే కలిగి ఉండాలి. ఒక వ్యక్తి భార్యకు కూడా ఆర్థిక భద్రత కల్పించాలని అనుకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరితే మంచిది.

అయితే 60 సంవత్సరాలు దాటిన తరువాత మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నెలకు 5,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రూ.1,11,98,471 వస్తాయి. మన దేశంలోని పౌరులు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here