Naveen murder Case : అబ్దుల్లాపూర్ మెట్ లో అత్యంత పాశవికంగా జరిగిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ లొంగిపోయినా తానొక్కడే హత్య చేయలేదని అతనికి మరికొందరు సహకరించారని పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది. నిజానికి నవీన్ ను హరిహర పార్టీ చేసుకుందాం అని పిలిచి ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్లి మందు కొనుగోలు చేసి నిర్మానుష్య ప్రాంతానికి అనుకున్నట్లుగానే హరిహర కృష్ణ నవీన్ ను తీసుకెళ్లి హతమార్చాడు. అయితే వైన్ షాప్ దగ్గర దొరికిన సీసీటీవీ ఫుటేజ్ లో ఆసక్తికర విషయాలు తెలిసాయి.
హరిహర తో పాటు మరో ఇద్దరు…
నవీన్ మీద నిహారిక రెడ్డి విషయంలో పగ పెంచుకున్న హరిహర కృష్ణ అతడిని చంపడానికి దాదాపుగా మూడు నెలల ముందు నుండే ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఫిబ్రవరి 17న హరిహర, నవీన్ ఇద్దరూ వైన్ షాప్ వద్దకు వెళ్లి మందు కొనుగోలు చేసి అక్కడి నుండి మరో ప్రాంతానికి వెళ్లి పార్టీ చేసుకున్నట్లు ఇప్పటివరకు అంతా అనుకున్నా వైన్ షాప్ సీసీటీవీ లో మరో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. వైన్ షాప్ వద్ద హరిహర, నవీన్ ఇద్దరితో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
అక్కడ వాళ్ళు మందు కొనుగోలు చేసి ఫోటో తీసుకోవడం కూడా వీడియోలో కనిపిస్తుంది. ఆ ఫోటోలను గ్రూప్ లో అప్లోడ్ చేసి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఇక నలుగురూ కలిసి వెళ్లే ఫుటేజ్ ఉండటం, అదీ కాక నవీన్ ను గొంతు నులిమి చంపిన తరువాత హరిహర అతని తల మొండెం వేరు చేసాడు, ఇది ఒకడితో అయ్యేపని కాదు అనే అనుమానం మొదటి నుండి ఉంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారాల్తో హరిహర తో పాటు మరికొందరు ఈ హత్యలో ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…