Naveen murder Case : అబుల్లాపూర్ మెట్ లో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారిక రెడ్డి తో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ హత్య చేసి తల, మొండేం వేరు చేసి గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వాట్సాప్ లో పంపాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది. నిహారిక రెడ్డికి అలాగే హరిహర ఇద్దరికీ శిక్ష పడాలి అంటూ నవీన్ కుటుంబం కోరుకుంటోంది. ఇక నవీన్ కుటుంబానికి ప్రముఖుల పరామర్శలు జరుగుతున్నాయి.
నవీన్ కుటుంబాన్ని ఓదార్చిన అచ్చంపేట ఎమ్మెల్యే…
అత్యంత పాశవికంగా నవీన్ ను అతని స్నేహితుడే చంపేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. ఒక అమ్మాయి కోసం తన స్నేహితుడిని హరిహర అది కూడా అత్యంత దారుణంగా చంపేశాడు. దీంతో నవీన్ కుటుంబ సభ్యులు కొడుకును ఇంత క్రూరంగా చంపిన వారిని వదలకూడదని, మాకు న్యాయం జరగాలంటూ కోరుతున్నారు.
నవీన్ కుటుంబానికి అటు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నుండి మద్దతు లభిస్తోంది. తాజాగా అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బాలరాజు నవీన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక ఆయన నవీన్ తల్లిదండ్రులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వగా నవీన్ హత్యతో ప్రమేయం ఉన్న ఆ అమ్మాయి నిహారిక రెడ్డిని కూడా శిక్షించాలని డిమాండ్ చేసారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…