Naveen Murder Mistery : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారిక రెడ్డితో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ హత్య చేసి తల, మొండేం వేరు చేసి గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వాట్సాప్ లో ఫోటో తీసి పంపాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది. నిహారిక రెడ్డికి అలాగే హరిహర ఇద్దరికీ శిక్ష పడాలి అంటూ నవీన్ కుటుంబం కోరుకుంటోంది. ఇక పోలీసుల అదుపులో ఉన్న హరిహర మరిన్ని షాకింగ్ విషయాలను చెబుతున్నాడు.
విక్రమ్ సినిమా చూసి అలా చంపాను…
నవీన్ హత్యకు రీసెంట్ గా వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ సినిమా ఇన్స్పిరేషన్ అంటూ పోలీసుల విచారణలో హరిహర చెప్పడం జరిగింది. సాక్ష్యాలు లేకుండా చేయడానికి ఆ సినిమాలో తల మొండెం వేరు చేసి కాల్చేయడం వంటివి చూపించినట్లుగానే తాను చేసానని హరిహర చెప్పాడు. ఇక హత్య చేశాను, నా స్నేహితున్నే చంపాను అనే భయం, పాశ్చాత్తపం అసలు ఏ మాత్రం హరిహర ముఖంలో లేకపోవడం పోలీసులు అడిగిన వాటికి సమాధానము చెబుతూ బెరుకు లేకుండా ఉండటం విడ్డూరం.
ఇప్పటికీ తాను చేసిన పని తప్పు అనే భావనలో హరిహర కనిపించడం లేదనే వార్త వినిపిస్తోంది. ఇక నిహారిక రెడ్డిని విచారిస్తున్న పోలీసులకు ఆమె చుక్కలు చూపెడుతోంది. సమాధానం చెప్పకుండా సుసైడ్ చేసుకుంటానని బెదిరించడం గురించి ఆల్రెడీ తెలిసిందే. ఇక ఆమెను సఖి సెంటర్ కి కౌన్సిలింగ్ కోసం పంపడం జరిగింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…