Nayanathara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమ లో ఉన్నారు. ఈ విధంగా ప్రేమ పక్షులుగా విహరించిన ఈ జంట ఎట్టకేలకు జూన్ 9వ తేదీ మహాబలిపురంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
పెళ్లికి ముందు వివిధ క్షేత్రాలను సందర్శించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి అయిన మరుసటి రోజే తిరుమల శ్రీవారిని ఈ కొత్త జంట దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే నయనతార శుక్రవారం ఉదయం స్వామివారి కల్యాణోత్సవ సేవలో ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలతో నూతన జంటను ఆశీర్వదించారు.
ఇక శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం నయనతార మీడియా ముందుకు వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆలయ మాడ వీధులలో నయనతార చెప్పులు వేసుకుని తిరగడం పై పలువురు ఈమె వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్నారు. పవిత్రమైన మాడ వీధులలో నయనతార ఇలా చెప్పులు వేసుకుని తిరగడం ఏంటి అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా నయనతార తిరుమల మాడవీధుల్లో కనిపించడంతో ఒక్కసారిగా మీడియా కూడా తనని చుట్టు ముట్టింది. అయితే కొందరు మీడియా ప్రతినిధులు కూడా చెప్పులు వేసుకుని మాడవీధుల్లో కనిపించడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున నటి నయనతార పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్ర మాడ వీధులలో చెప్పులు వేసుకొని తిరగటంతో ఈ విషయం కాస్తా వివాదంగా మారింది. ఇలా పెళ్లయిన మరుసటిరోజే నయనతార నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారని చెప్పాలి.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…