Categories: FeaturedMovie News

Mannava Koteswararo : యా సీన్ లో నేను నాగార్జునని తిట్టాలి.. నాకు ఆయనని చూస్తె భయమేసింది.. అప్పుడు నాగార్జున భుజం మీద చేయివేసి.. : మన్నవ కోటేశ్వరరావు

Manava Koteswararo : తెలుగు దర్శకుడు శంకర్ దర్శకత్వములో ఎన్ కౌంటర్ సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన కోటేశ్వరరావు గారు ఇటీవల యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఎన్ కౌంటర్ సినిమా తరువాత మళ్ళీ మోహన్ బాబు గారి సినిమాలే రాములయ్య, యమజాతకుడులో నటించినా.. నాగేశ్వరావు గారి సలహా మేరకు ఇతర సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పారు. సినిమాలకు ముందే వ్యాపారంలో అడుగుపెట్టిన కోటేశ్వరరావు గారు ఆ తరువాత సినిమాల వైపు వచ్చారు. ఇక నాగార్జున గారితో కేడి సినిమాలో నటించే సమయంలో ఆయన అనుభవాలను పంచుకున్నారు.

నాగార్జునను చూసి భయమేసింది.. బాలకృష్ణ అలాంటివాడు….

కేడి సినిమాలో నాగార్జున తో తొలిసారి చేస్తున్నపుడు కాస్త భయపడ్డానని, అదికాక నాగార్జున గారిని తిట్టే సన్నివేశం కావడంతో ఇంకాస్త ఇబ్బంది పడ్డానని చెప్పారు. అయితే నాగార్జున ఆ ఇబ్బందిని గమనించి ఏం పర్వాలేదు తిట్టండి నన్ను కాకుండా ఏ జూనియర్ ఆర్టిస్ట్ ని తిడుతున్న అనుకోని తిట్టండి అని భుజం పై చేయి వేసి చెప్పారట. కానీ టేకులు తీసుకోవడంతో పర్వాలేదు టేకులు తీసుకుని కొంచెం ఫ్రీ అవ్వండి అంటూ ప్రోత్సహించారని ఆ సినిమా తరువాత ఇంకెక్కడా ఇబ్బంది పడలేదని చెప్పారు. ఇక బాలకృష్ణ గారితో లెజెండ్ సినిమా అప్పుడు పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆయన చాల సరదాగా ఉంటారని, ఆహా లో వచ్చే అన్ స్టోపాబల్ షో లో ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో నిజంగా కూడా అలానే ఉంటారని చెప్పారు.

ఇక నాని తో కలిసి భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో నటించానని ఆ సినిమా సమయంలో లోకల్ మీడియాలో మాతో ఇంటర్వ్యూ కి వచ్చినపుడు నా పేరుని కోటేష్ మానవ అని చెప్పగా, అదేం పేరు అన్నారు. అపుడు నార్త్ వాళ్ళు ఇలానే చెప్తారు కదా అందుకు అలా చెప్పా అని అనగానే నాని వచ్చి అలా చెప్పకండి వాళ్ళు ఇంకేదో రాసుకుంటారు అంటూ వారిని ఇదంతా రాయకండి అంటూ చెప్పారని చాలా డౌన్ టు ఎర్త్ మనిషి నాని అంటూ ప్రశంసించారు. ఇక బోయపాటి గురించి చెబుతూ ఆర్టిస్టుల నుండి ఆయనకు ఏం కావాలో అది రాబట్టుకుంటారు అంటూ కితాబు ఇచ్చారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago