Nayanatara: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి నటి నయనతార ఇటీవల నటించిన తాజా చిత్రం అన్నపూరణి. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ తమిళంలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాలో నయనతారతో పాటు హీరో జై నటించారు. ఈ సినిమాలో నయనతార ఒక బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నయనతార అలాగే హీరో జై పలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ నేను జై కలసి రాజా రాణి సినిమాలో నటించాము. ఆ సినిమా తర్వాత తిరిగి ఈ సినిమాలో నటించామని తెలిపారు. ఇక రాజా రాణి సినిమాలో మా ఇద్దరి మధ్య కేవలం 20 నిమిషాలు మాత్రమే కథ సాగుతుందని ఈ సినిమా తర్వాత మేమిద్దరం చాలా మంచి స్నేహితులమయ్యామని నయనతార తెలిపారు. ఇక జై కూడా మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.
నయనతార నటన ఎంతో అద్భుతమని ఈమె కెమెరా ముందు నటించే తీరు చూస్తే ఈమెను లేడీ సూపర్ స్టార్ అనకమానదు అంటూ కామెంట్ చేశారు వెంటనే నయనతార మాట్లాడుతూ దయచేసి నన్ను లేడీ సూపర్ స్టార్ అని మాత్రం పిలవకండి అంటూ తెలియచేశారు. అలా ఆ పేరుతో నన్ను పిలిస్తే కనుక చాలామందికి నచ్చదని ఈమె తెలియజేశారు.
నటనలో ఆ స్థాయికి చేరుకోలేదేమో…
నేను లేడీ సూపర్ స్టార్ అనే పేరును పెట్టుకుంటే కనుక పదిమంది మాత్రమే ఇష్టపడతారని మిగిలిన 50 మంది నన్ను తిట్టుకుంటారని ఈమె తెలిపారు. వాళ్ళు అలా తిట్టుకోవడానికి కారణం బహుశా నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదేమో అంటూ ఈ సందర్భంగా నయనతార తనకు ఉన్నటువంటి లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…