Nayanthara -Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని అగ్రతారగా కొనసాగుతున్నారు.సౌత్ ఇండియాలోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా పేరు సంపాదించుకున్న నయనతార తాజాగా తన ప్రియుడు విగ్నేష్ తో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్లి మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో ఎంతో ఘనంగా జూన్ 9వ తేదీ జరిగింది. ఇక ఈమె పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేయడంతో ఈమె పెళ్లి వేడుకకు అయ్యే ఖర్చును కూడా
నెట్ ఫ్లిక్స్ భరించింది. ఇలా నయనతార విగ్నేష్ పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయడంతో ఈమె పెళ్లికి సంబంధించిన ఎలాంటి వీడియోలు సోషల్ మీడియాలో మనకు కనిపించలేదు.
తాజాగా నయనతార విగ్నేష్ పెళ్లికి సంబంధించిన ఒక టీజర్ ను నెట్ ఫ్లిక్స్ అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇందులో నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరు ఒకరిపై మరొకరికున్న ప్రేమను వారి అభిప్రాయాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే త్వరలోనే పెళ్లికి సంబంధించిన వేడుకను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇకపోతే నయనతార పెళ్లికి బాలీవుడ్, అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇదివరకే నెట్ ఫ్లిక్స్ వీరి ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలను కూడా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.ఇక వివాహం తర్వాత నయనతార సినిమాలకు దూరమవుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలలో నిజం లేదని ఈమె రెట్టింపు వేగంతో వరుస సినిమాలను అందుకొని బిజీగా ఉన్నారు.ప్రస్తుతం నాయనతార అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…