Nee Sneham Movie: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన సినిమాలలో నీ స్నేహం సినిమా ఒకటి. పరుచూరి మురళి డైరెక్షన్ లో ఎం.ఎస్. రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ నటుడుగా మరోసారి తనని తాను ప్రూఫ్ చేసుకున్నారు.
ఇక ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ మాధవ్ రోల్ లో నటించగా జతిన్ గ్రేవాల్ శీను రోల్ లో నటించారు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ రోల్ లో జతిన్ అద్భుతంగా నటించి మెప్పించారు. అయితే ప్రస్తుతం జతిన్ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే..
నీ స్నేహం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా జతిన్ కెరీర్ మొదలైంది. తెలుగు సినిమాలతో పాటు హిందీ, పంజాబీ సినిమాలలో నటించి జతిన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరమైన జతిన్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో జీవనం సాగిస్తున్నారు. సినిమా ఆఫర్లు వస్తున్న వాటికి జతిన్ నో చెబుతున్నారని సమాచారం అందుతోంది.
ఈయన సినిమాలకు దూరమైన తర్వాత 2010 వ సంవత్సరంలో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయితో జతిన్ వివాహం జరిగింది. ఇలా ఈ దంపతులకు ఇద్దరు పిల్లల కలరు పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనటువంటి జతిన్ తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని బావిస్తున్నారు. సినిమాలకు దూరమైన జతిన్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…