Medico Preethi Sister : వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో వైద్య విద్య లో అనస్థిషియా విభాగంలో పీజీ చేస్తున్న 26 ఏళ్ల ప్రీతి అనే యువతి ఆపరేషన్ థియేటర్లోనే ఆత్మహత్య చేసుకుంది. సీనియర్ వేధింపులు భరించలేక హానికర ఇంజక్షన్ వేసుకుని ఆత్మహాత్యకు పాల్పడింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నిన్న తనువు చలించిన ప్రీతి విషయంలో సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణం అంటూ ఆరోపిస్తున్న కుటుంబం సభ్యులు మాత్రం తాను ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, వాళ్ళే ఏదో చేసారు అంటూ అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.
మా చెల్లిని కులం పేరుతో సెపరేట్ చేసారు…
కుటుంబంలో అందరికీ తనను కాలేజీ లో సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేస్తున్న విషయం తెలిపిన ప్రీతి అంతలోనే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడదని ప్రీతి అక్క అభిప్రాయపడ్డారు. ఆ సీనియర్ విద్యార్ధికి రాజకీయ నాయకుల అండ ఉంది అని, హోమ్ మినిస్టర్ తెలుసనీ, అందుకే హెచ్ఓడి కూడా ఏమి చేయలేక పోతున్నాడని చెప్పేదని ప్రీతి అక్క చెప్పారు.
అయితే తనను కులం పేరుతో సెపరేట్ గా చూసేవారని ప్రీతిని కావాలనే అతను టార్గెట్ చేసి వేధించాడని, అయినా అతన్ని ఏమి చేయలేదని ఆరోపించారు. ఒకవేళ ఎక్కువగా టార్చర్ చేస్తుంటే వదిలేసి ఇంటికి వచ్చెయ్ అని కూడా చెప్పామని ప్రీతి అక్క కన్నీరుమున్నిరవుతున్నారు. కుల పిచ్చి ఇంత ఉంటుందని ఇలా నా చెల్లిని చేస్తారుసని అనుకోలేదంటూ ఎమోషనల్ అయ్యారు. నా చెల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…