Actor Sudheer Babu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా కనిపించడం కోసం వారి మేకోవర్ పూర్తిగా మార్చుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అధిక శరీర బరువు పెరగడం మరికొన్నిసార్లు బక్క పల్చగా ఉన్న పాత్రలలో నటించడం కోసం వారి శరీరాన్ని ఆ పాత్రకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి సుధీర్ బాబు తాజాగా హంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఈయన తాజాగా హర్షవర్ధన్ డైరెక్షన్లో మామ మశ్చేంద్ర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ ఫస్ట్ గ్లింప్ కూడా విడుదలైంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక మేకోవర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమా కోసం సుధీర్ బాబు లుక్ ఎంతో విభిన్నంగా ఉంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు అధిక శరీర బరువు పెరిగినట్టు తెలుస్తోంది. ఇలా ఎంతో శరీర బరువుతో ఉన్నటువంటి సుధీర్ బాబును చూడగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క క్షణం పాటు అసలు ఇక్కడ ఉన్నది సుదీర్ బాబేనా అనే సందేహం కూడా కలగక మానదు. అధిక పొట్ట బరువుతో సుధీర్ బాబు ఈ సినిమాలో సరికొత్త పాత్రలో సందడి చేయనున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…