Anchor Anasuya: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్తున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు.అనసూయ గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం అనసూయ ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపోతున్నానని పరోక్షంగా వెల్లడించారు.అయితే వచ్చే గురువారము తనకు జబర్దస్త్ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ అని తాజాగా వదిలిన ప్రోమో ద్వారా తెలుస్తుంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా తాగుబోతు రమేష్ అనసూయ గెటప్ లో స్కిట్ చేశారు. నాకు ఈ కార్యక్రమానికి రావడం కుదరట్లేదు వెళ్లిపోతానని చెప్పగా అక్కడ ఉన్నటువంటి వారందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
అనసూయ గెటప్ లో ఉన్నటువంటి తాగుబోతు రమేష్ జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. బట్ జబర్దస్త్ మాత్రం స్టిల్ రన్నింగ్ అంటూ కామెంట్ చేస్తుంది. ఇలా తాగుబోతు రమేష్ చెప్పేసరికి అనసూయ ఎమోషనల్ అవుతుంది. జబర్దస్త్ కార్యక్రమం నిన్ను చాలా మిస్ అవుతుంది అంటూ కంటతడి పెట్టుకున్నారు.
స్కిట్ అనంతరం చలాకి చంటి మాట్లాడుతూ..చిన్న పిల్లలు ఉన్నప్పుడే నువ్వు ఆ పిల్లలను మీ అమ్మకి ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చావు. ఇప్పుడు నెలలో మూడు రోజులు ఈ కార్యక్రమం కోసం కేటాయించలేవా అంటూ ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకు అనసూయ ఏ విధమైనటువంటి సమాధానం చెబుతుందో తెలియాల్సి ఉంది.మొత్తానికి అనసూయకు జబర్దస్త్ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ అని తెలియడంతో ఇంద్రజ సైతం అనసూయను మిస్ అవుతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…