బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవల అతడు అశ్లీల వీడియోల కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆ సమస్యల నుంచి కొన్ని రోజుల వరకు కోలుకోలేదు. తర్వాత ఇప్పుడిప్పడే వాళ్లు బయటకు రావడం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఆలయాలకు, షాపింగ్ లకు వెళ్తూ.. సమయం గడుపుతున్నారు.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. రాజ్ కుంద్రాను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే.. తాజాగా వాళ్లిద్దరు కలిసి ముంబై విమానాశ్రయం వద్ద ఏదో ప్రదేశానికి బయలు దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఉండగా.. అక్కడ ప్రముఖ సెలబ్రిటీ ఫొటో గ్రాఫర్ వైరల్ భయానీ వీడియో తీసి.. ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ వీడియోలో ఏ ముందంటే..శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా వేరువేరుగా తమ కార్ల నుంచి దిగి విమానాశ్రయం గేట్ల వైపు నడుచుకుంటూ వెళ్లారు. శిల్పాశెట్టి హడావుడి లేకుండా కారు దిగి.. ఎయిర్ పోర్ట్ గేట్ల వద్దకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. కానీ రాజ్ కుంద్రా మాత్రం కారు దిగి.. తన మొహాన్ని ఎవరికీ కనిపించడకుండా.. తల దించుకొని.. ఫోన్ చూసుకుంటూ.. ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లాడు.
అయితే ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రాజ్ కుంద్రా తన ముఖం కవర్ చేసుకున్నందుకు తెగ ట్రోల్ చేశారు. మీ ముఖాన్ని దాచుకునే పనులు ఎందుకు చేస్తారు సార్.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ఇలా మొహం దాచుకోవడం చూసి.. చాలా మంది నవ్వుతారు అంటూ మరొకరు ఇలా కామెంట్ చేశాడు. ఏదేమైనా అతడు కెమెరాలకు చిక్కకుండా.. మొహం దాచుకోవడంపై నెటిజన్లు.. మొహమాటం లేకుండా.. ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్‌కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…