టాలీవుడ్ లో హీరో సుమంత్ నటించిన సినిమా ‘సత్యం’. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జెనిలియా. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హాసిని పాత్రతో ఒక్కసారిగా కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుందీ చిన్నది.
ఈ సినిమా ఆమె కెరీర్ లోనే ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. తర్వాత ఆమె టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించారు. పోతినేని రామ్ హీరోగా నటించిన సినిమా రెడీ. దీనిలో కూడా జెనీలియాకు మంచి మార్కులే పడ్డాయి. ఇలా ఆమె తన కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న క్రమంలో బాలీవుడ్ యంగ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది.
వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న జెనిలీయా వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. ప్రేక్షకులకు ఆమె దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో కనెక్ట్ అవుతూనే వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన భర్త ఫొటోలను, తన పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ఆమె పెద్ద కుమారుడు రియాన్ 7వ పుట్టినరోజు సందర్భంగా, జెనీలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
ప్రియమైన రియాన్! నీ చిట్టి బుర్రలో ఉన్న బోలెడన్ని కోరికలు, ఆశలను కచ్చితంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా నీకు మాటిస్తున్నా. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కను కాలేను కానీ, ఆ రెక్కల కింద గాలినవుతా. ప్రతీ విషయంలో నువ్వు మొదటి స్థానంలో ఉండాలని కోరుకోను.. చివరిగా ఉన్నా సరే.. నీ ప్రత్యేకతల్ని నేను గుర్తిస్తాను. అంతే కానీ నిరాశ చెందను ఎప్పుడూ నీవెంటే ఉంటా.. నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను.. హ్యపీ బర్త్ డే రియాన్.. ఐ లవ్ యూ మై బ్రేవ్ బాయ్.. అంటూ తల్లి ప్రేమను కురిపించింది. ఈ ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…