ఒక తమిళ్ సినిమాలో తాను ఓ బ్యూటిఫుల్ రోల్ తాను నటించానని ప్రముఖ నటి అర్చన తెలిపారు. తనకు, తన మదర్‌కి ఓ కోడ్ లాంగ్వేజ్ ఉండేదని వీడు తేడా అని మాట్లాడుకుంటారని ఆమె అన్నారు. అలా సెట్లో ఉన్నపుడు వీడి బిహేవియర్ కొంచెం తేడాగా ఉందని అలా అనుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు.
ఇకపోతే కొందరు షూటింగ్ సెట్లో అర్చన గారు ఉండాలి అంటారు. తీరా వెళ్లాక సిల్లీ బిహేవియర్ కనిపిస్తూంటుందని ఆమె చెప్పారు. అప్పుడు తాను మమ్మీ వీడు కొంచెం తేడాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే, అవును. సరే వదిలేసేయ్ అని తన మదర్ అన్నట్టు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా షూటింగ్ కోసం హాంకాంగ్ వెళ్లానని, తనతో పాటు తన మదర్ కూడా వెంట వచ్చినట్టు ఆమె తెలిపారు. అక్కడ బ్యూటిఫుల్ సాంగ్ షూట్ చేశామని, మంచి ఫుటేజ్ షూటింగ్ కూడా అయిందని ఆమె అన్నారు.
కానీ ఆ ప్రొడ్యూసర్ చాలా యూజ్‌లెస్ ఫెలో అని ఆమె అన్నారు. వాడిని చూస్తే సినిమా తీయాలి, ఫ్యాషన్ కోసం ఏమీ రాలేదని, తన దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది. దాన్ని ఎక్కడో ఒక దగ్గర పెట్టేయాలి అనేసి వచ్చినట్టు తనకు అనిపించిందని అర్చన తెలిపారు.
ఒక రెండు మూడు సార్లు అతను మాట్లాడిన మాటలు తనకు నచ్చలేదని ఆమె అన్నారు. అయినా కూడా చూసీ చూడనట్టు ఉండి, అవేమీ తాను పట్టనట్టే ఉన్నానని ఆమె తెలిపారు. కానీ డైరెక్టర్‌కి మాత్రం తనపై మంచి ఒపీనియన్ ఉందని ఆమె చెప్పారు. చాలా ఫ్యాషనేట్ డైరెక్టర్ కూడా అని ఆమె అన్నారు.
ఇకపోతే ఆ సినిమా రిలీజైంది. ఆ తర్వాత తనకు అసలు విషయం తెలిసిందని అర్చన అన్నారు. అదేంటంటే, తాను చేసిన సాంగ్ మొత్తం ఆ సినిమా నుంచి తీసేసారని ఆమె వాపోయారు. అప్పుడు తాను చాలా బాధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…