సాధారణంగా ఆడపిల్ల పుడితే భారం అని భావించే వారు ఎంతోమంది ఆడపిల్లలు పుట్టగానే వారిని ముళ్ళ పొదలు, చెత్త కుండీలలో పడేయడం చూస్తుంటాను అదేవిధంగా మరికొందరు ఆడపిల్ల అని తెలియగానే కడుపులోని వారి ప్రాణాలను పైకి పంపిస్తున్నారు. కానీ ఉత్తర ప్రదేశ్ ఘాజీపూర్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. గంగానదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకు వచ్చింది.అది చూసిన ఓ వ్యక్తి ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఓ చంటి బిడ్డ ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపించడంతో పడవ నడుపుతున్న వ్యక్తి ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందోనని గమనించాడు. అయితే ఆ ఏడుపు నదిలో కొట్టుకు వస్తున్న చెక్క పెట్టె నుంచి వినిపించడంతో ఆ వ్యక్తి ఆ బాక్స్ ను పట్టుకొని దానిని తెరిచి చూశాడు. అయితే అందులో ఒక ఆడ బిడ్డ అదేవిధంగా అమ్మవారి ఫోటో ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు.
చెక్క పెట్టెలో ఒక ఎర్రటి వస్త్రంలో 21 రోజుల వయసున్న ఆడబిడ్డ ఉండడంతో పాటు ఆ బిడ్డ జాతకం ప్రకారం ఆ బిడ్డకు గంగా అని పేరు పెట్టినట్లు ఒక కాగితంలో రాసి ఉంది. అదేవిధంగా ఆ పెట్టెలో అమ్మవారి ఫోటో ఉండడంతో ఆ వ్యక్తి ఆ గంగమ్మ తల్లి ఈ బిడ్డను తనకు ప్రసాదించిందని భావించి, ఆ బిడ్డ దొరకడం తమ అదృష్టం అనుకొని బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళాడు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బిడ్డను తన దగ్గర పెంచుకోవడానికి వీలులేదని ఆ చిన్నారిని తీసుకుని ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు. అయితే ఈ బిడ్డను చెక్కపెట్టెలో ఎవరు నదిలో వదిలి ఉంటారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఏదిఏమైనా ఈ విధంగా చెక్కపెట్టెలో బిడ్డ కొట్టుకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…