Categories: FeaturedMovie News

Raj Tarun: వివాదంలో నటుడు రాజ్ తరుణ్… కెరియర్ ఇబ్బందులలో పడినట్లేనా?

Raj Tarun: సినీ నటుడు రాజ్ తరుణ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం తిరగబడర సామి అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ద్వారా ఈయన కచ్చితంగా హిట్ కొడతారని భావిస్తున్న తరుణంలో ఊహించని విధంగా ఒక కేసులో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లావణ్య అనే యువతితో రాజ్ గత 11 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నట్టు ఆమె వెల్లడించారు.గతంలోనే గుడిలో నాకు, రాజ్ తరుణ్ కు పెళ్లైందని అధికారికంగా మరోసారి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక హీరోయిన్ తో రిలేషన్ షిప్ వల్ల మోసం చేశాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా లావణ్యతో రాజ్ తరుణ్ చాలా చనువుగా ఉన్నటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా లావణ్య అనే యువతి ఈయన గురించి ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఈ ఆరోపణలపై రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్యతో నేను రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే మాది శారీరక రిలేషన్ కాదని ఈయన తెలిపారు. కావాలనే ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజ్ తరుణ్ తెలిపారు.

వేరే వ్యక్తితో రిలేషన్..
ఇక తనతో కలిసి ఉన్నన్ని రోజులు నాకు చాలా టార్చర్ పెట్టేదని కానీ ఆ విషయాలను నేను ఎక్కడ చెప్పుకోలేదని వెల్లడించారు. అంతేకాకుండా లావణ్య ప్రస్తుతం మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉందని కూడా ఈయన తెలియజేశారు. ఏది ఏమైనా ఇలా సినిమా విడుదల సమయంలో ఈయన ఈ విధమైనటువంటి వివాదంలో చిక్కుకోవడంతో ఈ వివాదం కారణంగా తన కెరీర్ ఇబ్బందులలో పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago