Niharika konidela : మెగా డాటర్ నిహారిక రాడిసన్ బ్లూ హోటల్ మింక్ అండ్ పుడ్డింగ్ పబ్ లో దాడి తరువాత బయట కనిపించలేదు. ఉగాది పండుగ నాడు పబ్ కేసులో ఇరుక్కోవడం అందులోను ఆ పబ్ లో డ్రగ్స్ పట్టుబడటంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది నిహారిక . ఇక అంతకు ముందు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో జిమ్ ట్రైనర్ పై కూర్చొని పుష్ అప్స్ చేసే వీడియో పై సర్వత్రా విమర్శలు రావడంతో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసింది నిహారిక.
ఇక ఈ రెండు ఇష్యూలా తరువాత బయట కనిపించలేదు. ఇక తన భర్తతో కూడా కలిసి లేదని త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇక వీటికి చెక్ పెడుతూ ఇటీవల తన భర్తతో కలిసి పింక్ ఎలిఫెంట్ సంస్థతో ఒక వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ ప్రారంభించింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు భర్త చైతన్య.
విహార యాత్రలకు సంబంధించిన ప్రోగ్రామ్…
ఇక నిహారిక తన భర్తతో కలిసి జోర్డాన్ ట్రిప్ వెళ్లారు. ఇక అక్కడి అందాలను ఐ ఫోన్ డిఎస్ఎల్ఆర్ కెమెరాతో చాలా అందంగా బంధించారు. ఇక ఈ ఫొటోలతో మళ్ళీ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చింది నిహారిక తిరిగి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ప్రారంభించింది. రక ఈ ట్రిప్ ఫోటోలను తన ఖాతాలో పోస్ట్ చేసింది. తన భర్త ఫోటోలను చాలా చక్కగా తీసారంటు చెప్పుకొచ్చింది.
కానీ నిహారిక తన భర్త జేవి చైతన్యతో కలిసి విహార యాత్రలకు సంబంధించిన ప్రోగ్రామ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట తెలుగులో ట్రావెల్ షోను హోస్ట్ చేయడానికి ఆఫర్ అందుకుందని , ప్రముఖ ఛానెల్ ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేసిందని వారి ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసి, వారితో పాటు కెమెరా సిబ్బందిని తీసుకువెళ్లినట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ కార్యక్రమం యొక్క తెలుగు వెర్షన్ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయబడుతుంది మరియు ఇంగ్లీష్ వెర్షన్ జాతీయ టీవీలో ప్రదర్శించబడుతుంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ప్రస్తుతానికి మాత్రం నిహారిక పింక్ ఎలిఫెంట్ నిర్మాణ సంస్థలో వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…