మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎక్కడ ఉంటే సందడి అక్కడ ఉంటుంది.సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే నిహారిక తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునీ అభిమానులకు దగ్గరగా ఉంటారు.అయితే గత యేడాది వివాహం చేసుకున్నా నిహారిక వివాహం తర్వాత కూడా పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.
వెండితెరకు దూరంగా ఉంటున్న నిహారిక వెబ్ సిరీస్ ల తో ఎంతో బిజీగా ఉన్నారు.గత కొంతకాలం క్రితం అనసూయతో కలిసి నిహారిక ఓ వెబ్ సిరీస్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో నిహారికతో పాటు ఆమె భర్త చైతన్య కూడా ఉన్నారు.
అలా భర్తతో కలిసి వెబ్ సిరీస్ ను ప్రారంభించిన నిహారిక తాజాగా ఆ వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నిహారిక సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సిగరెట్ ప్యాకెట్ ను చూపిస్తూ.. స్వీట్ సిగరెట్ అంటూ బాగుందనే ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వామ్మో నిహారిక సిగరెట్ అలవాటు ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నిహారిక చేస్తున్న వెబ్ సిరీస్ లో భాగంగా ఆ స్వీట్ సిగరెట్లను నిహారిక తాగినట్లు కనిపిస్తోంది.ఏది ఏమైనా పెళ్లి తర్వాత కూడా నిహారిక ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నారని చెప్పవచ్చు .
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…