Niharika: మెగా డాటర్ నిహారిక తాజాగా ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. గతంలో తనకు ఆంధ్రాలోనే ఓటు ఉంది అని చెప్పినటువంటి ఈమె ప్రస్తుతం తన ఓటు అక్కడ లేదని ఎందుకు రద్దు అయిందో కారణాలు తెలియవని చెప్పుకు వచ్చారు. అంతేకాకుండా తన బాబాయ్ పాలిటిక్స్ గురించి కూడా ఈమె మాట్లాడారు ఈసారి ఎలక్షన్స్ లో ఎలాగైనా బాబాయ్ గెలవాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
బాబాయ్ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారు ఆయన రాజకీయాలలోకి రాక ముందు కూడా తన చుట్టూ ఉండే వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే రాజకీయాలలోకి వచ్చే ప్రజలకు సేవ చేయాలని తపన పడుతున్నట్లు నిహారిక తెలిపారు. ఇక బాబాయ్ తో పాటు నాన్న కూడా రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారని తెలిపారు.
ఇక నాన్నకు టికెట్ కన్ఫర్మ్ అయితే ఆంధ్రాలో మేము ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నాము. రాజకీయ పనులలో పడి నాన్న మా దగ్గర అసలు ఉండడం లేదని నాన్నను చాలా మిస్ అవుతున్నటువంటి తరుణంలో అక్కడ ఇల్లు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా నిహారిక వెల్లడించారు.
ఆంధ్రాలో ఇల్లు..
నాన్న ఇంటికి రాగానే ఒక అరగంట కూడా ఉండరు తిరిగి వెళ్లిపోవాలని చెబుతుంటారు బాబాయ్ ఎలా ఉన్నారు నాన్న అంటే తను చాలా బిజీగా గడుపుతున్నారమ్మా అంటూ సమాధానం చెబుతారు.ఇలా అందరూ బాగుండాలని కోరుకునే బాబాయ్ ఈసారి ఎన్నికలలో గెలిస్తే రాష్ట్ర ప్రజలకు కూడా మంచే జరుగుతుంది అంటూ నిహారిక చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…