Niharika: నిహారిక కొణదెల గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె గత కొద్దిరోజులుగా తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు దూరంగా ఉండటమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో తనని అన్ ఫాలో చేయడం అలాగే పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇలా నిహారిక చైతన్య ఇద్దరు కూడా పెళ్లి ఫోటోలను డిలీట్ చేసిన సందర్భంగా వీరు విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలను మెగా కుటుంబం ఖండించే ప్రయత్నం చేయలేదు.గత కొంతకాలంగా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నటువంటి నిహారిక తిరిగి ఇప్పుడు చాలా యాక్టివ్ అయ్యారు. తనకు సంబంధించిన విషయాలతో పాటు పెద్ద ఎత్తున ఫోటోషూట్లు చేయించి ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
నిహారిక ఇండస్ట్రీలోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోయిన్గా స్థిరపడిన విషయం మనకు తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె నిర్మాతగా స్థిరపడి పింక్ ఎలిఫెంట్ పిక్చర్ అనే సొంత బ్యానర్ ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ బ్యానర్ పై పలు వెబ్ సిరీస్ లను కూడా నిర్మించారు. అయితే ఈమె ఎప్పటినుంచో తన ప్రొడక్షన్ హౌస్ కి హైదరాబాదులో ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలని అనుకుంటూ ఉన్నారు.
ఈ క్రమంలోనే అనుకున్న విధంగానే హైదరాబాదులో తన ప్రొడక్షన్ హౌస్ కోసం ఒక ఆఫీసును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజ కార్యక్రమాలను కూడా ఈమె పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు తనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఈ పూజా కార్యక్రమాలలో నిహారిక భర్త చైతన్య కనిపించకపోవడంతో నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారని స్పష్టమవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…