Movie News

Niharika: నిహారిక విడాకులు కన్ఫామ్….పెళ్లి ఫోటోలు డిలీట్ చేస్తూ హింట్ ఇచ్చిన మెగా డాటర్?

Niharika: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది. అయితే హీరోయిన్ గా సరైన గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు స్వస్తి చెప్పి నిర్మాణరంగం వైపు అడుగులేసింది. జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక అతని సహకారంతో నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు నిర్మించడమే కాకుండా వాటిలో నటిస్తూ బిజీగా ఉంది.

గత కొంతకాలంగా నిహారిక చైతన్య విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వీరిద్దరూ ఇటీవల వారి పెళ్లి ఫోటోలతో పాటు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేశారు. అంతేకాకుండా ఒకరి ఒకరు అన్ ఫాలో చేసుకోవటంతో వీరి విడాకుల వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.

పెళ్లికి సంబంధించిన అన్ని ఫోటోలను డిలీట్ చేసిన నిహారిక ఒక్క ఫోటో మాత్రం డెలీట్ చేయకుండా అలాగే ఉంచింది. పెళ్ళి మండపంలో ఇద్దరు కలిసి ఉన్న ఉన్న ఫోటో అది. ఆ ఫోటో కింద ” నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది. కానీ మీకు చెప్పేస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది? అందుకే చెప్పలేను సారీయే అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అయితే పెళ్లికి సంబంధించిన అన్ని ఫోటోలను డిలీట్ చేసిన నిహారిక ఈ ఒక్క ఫోటోని అలాగే ఉంచడానికి గల సీక్రెట్ ఏమిటి అని అందరూ ఆలోచనలో పడ్డారు.

Niharika: క్లారిటీ ఇవ్వాల్సి ఉంది…


ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపించే వీరిద్దరూ ప్రస్తుతం బయట కనిపించడం లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా జట్టుగా కనిపించకపోవడంతో మీరు విడాకుల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై నిహారికతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా ఎవరు స్పందించకపోవడం గమనార్హం.మరి ఈమె విడాకుల విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

BIG BREAKING: తెలుగు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు – భద్రతా చర్యలు ముమ్మరం

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…

4 minutes ago

కేజీ వెండి ధర కుప్పకూలింది.. దేశవ్యాప్తంగా ఒకేసారి భారీ తగ్గుదల!

వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…

39 minutes ago

హలీం.. రంజాన్ సీజన్‌లో ఆరోగ్య బోనస్! దీని ప్రయోజనాలు తెలుసుకున్నా వదలలేరు..

రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…

46 minutes ago

ఇకపై రిస్క్‌ వద్దు.. ప్రభాస్ పెద్ద ప్రాజెక్ట్స్ విషయంలో కచ్చితమైన నిర్ణయం..!

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ కెరీర్ మరో మలుపు తిరుగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ…

1 hour ago

“అత్యాచారం తర్వాత హత్య… ఇప్పుడు నిందితుడి మృతి – అన్నమయ్య జిల్లాలో సంచలనం!”

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అన్నమయ్య జిల్లా ఘటనకు మరో కీలక మలుపు తిరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని…

1 hour ago

అరటి మాత్రమే కాదు… మలబద్ధకం తగ్గించే ఈ సహజ ఆహారాలు తెలుసా?

ఉదయం లేవగానే శరీరం తేలికగా అనిపించకపోతే రోజంతా ఏదో భారంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తున్న సాధారణ…

1 hour ago