Movie News

Niharika -Venkata Chaitanya: విడాకులకు సిద్ధమైన మెగా డాటర్ నిహారిక…. పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన చైతన్య!

Niharika -Venkata Chaitanya: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిహారిక 2020 డిసెంబర్ నెలలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వివాహం జైపూర్ ప్యాలెస్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితంలో కొనసాగుతున్నటువంటి నిహారిక వెంకటచైతన్య విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని తాజా పరిణామాలు చూస్తుంటే వీరి విడాకుల విషయం చర్చనీయాంశంగా మారింది.ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ జంట సోషల్ మీడియా అయినటువంటి ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో కావడం లేదు. అదేవిధంగా వెంకటచైతన్య తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేశారు.

ఇలా నిహారికతో పెళ్లికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్త తెరపైకి వచ్చింది అయితే ఈ వార్త తెలిసినటువంటి మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వైవాహిక జీవితంలో నిహారిక చైతన్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అలాంటిది వీళ్ళు విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Niharika -Venkata Chaitanya: మెగా ఫ్యామిలీకి దూరంగా చైతన్య…

మరి నిహారిక చైతన్య గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.అయితే కొద్ది రోజులుగా నిహారిక ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెకేషన్ వెళ్తూ ఉన్నారు. అలాగే మెగా కుటుంబంలో జరిగే వేడుకలకు కూడా వెంకట చైతన్య హాజరు కాకపోవడం గమనార్హం. ఇలా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం తన పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago