ఎస్ బ్యాంక్ సంక్షోభం ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో డిపాజిటర్లు, ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తమ డబ్బులు వస్తాయో లేదో ? బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు పరిస్థితి ఏంటి ? అనే అనేక సందేహాలతో ఆందోలనలో పడ్డారు ఖాతాదారులు. పలురకాల సందేహాలతో ఉన్న ఎస్ బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు.
ఎస్ బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో ఉన్న నగదుపై ఎటువంటి సందేహాలు పడవద్దని. అకౌంట్లలో ఉన్న నగదు సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేసారు. అనేక ఆర్ధిక సమస్యలలో కూరుకుపోయిన ఎస్ బ్యాంకును గట్టెకించేలా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తో చర్చించినట్టు తెలిపారు. ఈ విషయంలో ఆర్బీఐ అధికారులు పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుతం, ఆర్బీఐ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.
అకౌంట్ హోల్డర్ల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు ఆర్ధిక మంత్రి. ఈ విషయంపై ఖాతాదారులు ఎంటువంటి ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. అయితే ప్రస్తుతం 50 వేల నగదు డ్రా చేసుకుందుకు అవకాశం కల్పించామని తెలిపారు. బ్యాంకు మరియు దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రయోజనాలను ద్రుష్టి లో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు నిర్మల సీతారామన్.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…