హైదరాబాద్ లో కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టేందుకు ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్, వైద్యాధికారులతో చర్చలు, సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా తరచూ గాంధీ ఆసుపత్రి, ఫెవర్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. కరోనా ఐసోలేటెడ్ వార్డులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గారి భార్య కొన్ని సూచనలు చేశారట. ఈ విషయాన్నీ అనే స్వయంగా వెల్లడించారు.
విధులపరంగా రోజూ ఎక్కడో తిరుగుతున్నారని, ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారని, వైద్యులు, రోగులు తో సన్నిహితంగా మెలుగుతున్నందున ఇంటికి వచ్చేముందు ఆఫీసులోనే స్నానం చేసి రావాల్సిందిగా సూచించారట. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సోకకుండా అందరు తగు జాగ్రత్తలు వహించాలని.. వైరస్ సోకినా వారు తప్ప మిగిలినవారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
గాంధీ ఆసుపత్రిలో ఐసోలేటెడ్ వార్డు ఏర్పాటును అయన సమర్ధించారు. ఐసోలేటెడ్ వార్డును ఇక్కడ నుంచి తొలగించాలని వ్యాఖ్యానిస్తున్న జూనియర్ డాక్టర్లను తాను మందలించానని తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్నప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలని, అంతేగాని రోగులను దూరంగా ఉంచడం కరెక్ట్ కాదని, వైద్యులను దేవుడుగా కొలుస్తారన్న విషయాన్నీ వారికి గుర్తు చేసానని తెలిపారు. పూణే ల్యాబుకు పంపిన రెండు నమూనాలు నెగిటివ్ రావాలని దేవుడిని ప్రార్ధించానని మంత్రి అన్నారు. అదే పాజిటివ్ వచ్చి ఉంటె రాష్టంలో ప్రజలు మరింత భయబ్రాంతులకు గురయ్యేవారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…