బుల్లితెరపై జంటగా నటించిన ఎంతోమంది నటీనటులు నిజ జీవితంలో మూడుముళ్ల బంధం ద్వారా ఎంతోమంది ఒక్కటయ్యారు. అలాంటి జంటలలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జంట పరిటాల నిరుపమ్, మంజుల జంట ఒకటి అని చెప్పవచ్చు. ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ జంట చివరకు మూడుముళ్ల బంధం ద్వారా వారి ప్రయాణం కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నో సీరియల్స్ నటిస్తూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇక మంజుల సైతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే నటి మంజుల సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలను తెలియజేశారు. ఎక్కువ మంది నెటిజన్లు తన భర్త నిరుపమ్ గురించి తన చెల్లి కీర్తి గురించి ప్రశ్నలు అడిగారు. ఇక ఓ నెటిజన్ ఏకంగా నటి మంజులను తన ఫోన్ నెంబర్ అడగడంతో క్షణం కూడా ఆలోచించకుండా మంజుల తన ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఈ విధంగా మంజుల ఫోన్ నెంబర్ ఇవ్వడంతో నెటిజన్లు ఎంతో కంగుతిన్నారు. అయితే మంజుల ఇచ్చినది సెల్ ఫోన్ నెంబర్ ఏ కాదని అది తొమ్మిది నుంచి మొదలవుతుంది వరుసగా 0 వరకు రాసుకొచ్చారు. ఈ విధంగా ఫోన్ నెంబర్ రూపంలో ఉన్న నెంబర్ ను ఇవ్వడంతో నెటిజన్లు ఈమె తెలివితేటలకు ఆశ్చర్యపోతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…