Nithin: టాలీవుడ్ ఇండస్ట్రీకి జయం సినిమాతో పరిచయమైనటువంటి హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ యంగ్ హీరో 2020 కరోనా సమయంలో తన ప్రేయసి షాలినిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.కరోనా సమయంలో ఈ దంపతులు పెళ్లి చేసుకోవడం వల్ల కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వీరి వివాహం జరిగింది.
నితిన్ నాగర్ కర్నూల్ కు చెందిన డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె డాక్టర్ షాలినితో గత కొన్నేళ్ల నుంచి ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ విషయాన్ని బయటకు తెలియకుండా రహస్యంగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇలా దాదాపు 8 సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట 2020 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
ఇక శాలిని కూడా వృత్తిపరంగా డాక్టర్ కావడం విశేషం.ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న నితిన్ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నితిన్ త్వరలోనే తండ్రి కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. షాలిని గర్భం దాల్చిందని త్వరలోనే ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ వార్తలు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంలో అభిమానులు..
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా నితిన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మరి నితిన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తలు పై క్లారిటీ రావాలంటే నితిన్ స్పందించాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…