Nithya Menon: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలో పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి నిత్యామీనన్.ఇలా కెరియర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె వరస సినిమాలు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.
ఇకపోతే కొద్ది రోజులుగా నిత్యమీనన్ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో తనని ఓ వ్యక్తి కొత్త ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేస్తూ సతాయించాడని తనని ప్రేమిస్తున్నాడు అంటూ ఈమె ఆరోపించారు. ఇలా తనని ఎన్నో వేధింపులకు గురి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున నిత్యమీనన్ గురించి వార్తలు వచ్చాయి. ఇలా ఏదో ఒక విషయం ద్వారా నిత్యామీనన్ సోషల్ మీడియా వార్తలు నిలుస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రంబలం సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యమీనన్ పూర్తిగా ఈ వార్తలను ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో చాలామంది శత్రువులు ఉన్నారని తెలిపారు. మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఇలా మనల్ని వెనక్కు లాగే ప్రయత్నం చేస్తుంటారని వారు చెప్పిన విధంగా వినకపోతే ఇలాంటి వదంతులు పుట్టిస్తుంటారని ఈమె పేర్కొన్నారు.
ఇలా నా శత్రువులు నా గురించి పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు సృష్టించారని ఈమె పేర్కొన్నారు. నేను ఎంతోమంది దర్శకులు హీరోల దగ్గర పని చేశాను ఎవరి దగ్గర నుంచి నేను ఎలాంటి చేదు అనుభవాలను ఎదుర్కోలేదని తన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే అంటూ ఈ సందర్భంగా నిత్యామీనన్ తన గురించి తన పెళ్లి చేసుకోబోతున్న విషయం అలాగే ఓ వ్యక్తి తనకు ఫోన్లు చేసి హింసించారంటూ వచ్చే వార్తలు అన్నింటిని పూర్తిగా కొట్టి పారేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…