కరోనా మహమ్మారి విజృంభన వల్ల దేశంలో చాలామంది ప్రజలు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతున్నారు. ఎంతో ముఖ్యమైన పనులు ఉంటే మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆధార్ కార్డులో చిన్నచిన్న తప్పులు ఉన్నా కార్డులో మార్పులు చేసుకోవడానికి ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలన్నా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఆధార్ కార్డులో తప్పులు ఉంటే ఇంటి నుంచే సులభంగా మార్పులు చేసుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కరోనా విజృంభణ నేపథ్యంలో ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో సులభంగా ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్, లాంగ్వేజ్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సేవలు కాకుండా ఇతర సేవలను పొందాలని అనుకుంటే మాత్రం ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవాలని అనుకుంటే మొదట uidai.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి. ఆ తరువాత వెబ్ సైట్ లో మై ఆధార్ అనే సెక్షన్ ను ఎంచుకోవాలి. అందులో అప్ డేట్ ఆధార్ అనే ఆప్షన్ ను ఎంచుకుని అందులో అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్ లైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ప్రొసీడ్ టు అప్ డేట్ ఆధార్ అనే ఆప్షన్ ద్వారా ఆధార్ కార్డ్, క్యాప్చా వివరాలను ఎంటర్ చేయాలి.
ఆ తరువాత రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి అప్ డేట్ డెమోగ్రాఫిక్ డేటా అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత పేరు, చిరునామా, ఇతర వివరాలలో మార్పులు చేసి అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డును జత చేయాలి. ఆ తరువాత 50 రూపాయలు చెల్లించడం ద్వారా ఆధార్ కార్డులో మార్పులు చేసుకుని కొన్ని రోజుల తరువాత కొత్త ఆధార్ కార్డును పొందవచ్చు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…