తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని పొందాలని అనుకునే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రిస్క్ ఉన్నా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కనీస జాగ్రత్తలు తీసుకుని కళ్లు చెదిరే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు భారీ నష్టాలను చవిచూసినా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు మాత్రం భారీ లాభాలు వచ్చాయి.
గతేడాది 5 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లు 50 శాతం నుంచి 70 శాతం వరకు లాభాలను సొంతం చేసుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం సంవత్సర కాలంలో ఏకంగా 13 శాతం పెరిగి 30 లక్షల కోట్ల రూపాయల రాబడిని సొంతం చేసుకోగా ఈ రాబడి ఆల్ టైం రికార్డ్ కావడం గమనార్హం. నిఫ్టీ, సెన్సెక్స్ లతో పోల్చి చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఉత్తమమైనవని చెప్పవచ్చు.
గతేడాది డీఎస్‌పీ హెల్త్ కేర్ ఫండ్ రెగ్యులర్ ఏకంగా 76 శాతం రాబడిని అందించగా మీరా అసెట్ హెల్త్‌కేర్ ఫండ్ రెగ్యులర్ దాదాపు ఇదే స్థాయిలో 73 శాతం రాబడిని అందించింది. ఈ రెండు మ్యూచువల్ ఫండ్ల నెట్ అస్సెట్ వాల్యూ 19 రూపాయలు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫార్మా హెల్త్ కేర్ & యాగ్నస్టిక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 71 శాతం లాభాలను అందించగా దీని నెట్ అస్సెట్ వాల్యూ 18 రూపాయలు కావడం గమనార్హం.
ఈ మ్యూచువల్ ఫండ్స్ తో పాటు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ గ్రోత్, యూటీఐ హెల్త్ కేర్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఫండ్ కూడా అదిరిపోయే రాబడులను అందించడం గమానార్హం. గతేడాది ఈ మ్యూచువల్ ఫండ్స్ అదిరిపోయే లాభాలను అందించిన నేపథ్యంలో రిస్క్ ఉన్నా వీటిలో పెట్టుబడులు పెడితే లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…